జీసస్ తో వర్మ వాట్సప్ చాట్...!

SMTV Desk 2019-02-08 10:51:18  Ram Gopal Varma, KA Paul, Twitter, RGV comments on KA Paul

అమరావతి, ఫిబ్రవరి 08: మత ప్రచార కర్త, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశాడు. తన పేరును ఇంతగా చెడగొడుతున్నందుకు కేఏ పాల్ కు శిలువ వేయబోతున్నానని ఇప్పుడే జీసస్ క్రైస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టాడంటూ ట్వీట్ చేశాడు.

గత కొద్దిరోజులుగా కేఏ పాల్, వర్మల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మోదీ, చంద్రబాబుల వంటి చిన్న నేతలపై పోటీ చేసేకంటే జీసన్ ను ఓ ప్రపంచాన్ని సృష్టించమని కోరి దానికి కేఏ పాల్ అధ్యక్షుడు అయిపోవచ్చని వర్మ గతంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

దీనికి సమాధానంగా ముంబై హోటల్ లో నా పాదాలకు వర్మ నమస్కారం చేశాడంటూ పాల్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు దీనికి కౌంటర్‌గా ఆర్జీవీ ప్రభువా! నేను పాల్ కాళ్లు ముట్టుకోలేదు. జస్ట్ పట్టుకుని వెనక్కి లాగితే వెనక్కి పడి తల నేలకు కొట్టుకుని, బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా, కానీ మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేశా అని తాజాగా కామెంట్ పోస్ట్ చేశారు.