ప్రముఖులకు రజినీకాంత్ ఆహ్వానం

SMTV Desk 2019-02-08 09:04:45  Rajinikanth, Soundarya Marriage invitation, Kamal hasan, Prabhu, Thiruvukkarasar, Chennai

చెన్నై, ఫిబ్రవరి 08: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. రజినీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం తమిళ నటుడు, వ్యాపారవేత్త అయిన విషగన్‌ వనగమూడితో ఫిబ్రవరి 11న వైభవంగా జరగబోతుంది. ఈ నేపథ్యంలో రజినీకాంత్ సినీ ప్రముఖులను, రాజకీయ ప్రముఖులను స్వయంగా వారి ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తున్నారు. సూపర్ స్టార్ తన కుమార్తె వివాహ తొలి ఆహ్వాన పత్రికను తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తిరునవుక్కరాసర్‌కు కు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లడుతూ తన కుమార్తె వివాహంలో తిరునవుక్కరాసర్‌ దగ్గరుండి పెళ్ళికి సంభందించిన అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నాడని అందుకే మొదటి శుభలేఖ ఆయనకు అందించానని తెలిపారు.

రజినీకాంత్ తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి కమలహాసన్ ఇంటికి వెళ్లారు. కమలహసన్ రజినీకాంత్ ను చూడగానే ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. వివాహానికి రావాల్సిందిగా రజినీకాంత్ కమల్ హసన్ ని ఆహ్వానించారు. అంతేకాకుండా తమిళ నటుడు ప్రభుని కూడా రజిని వివాహానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రజనీతో కలిసి దిగిన ఫొటోలను ప్రభు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పెళ్లి అనంతరం ఫిబ్రవరి 12న ఘనంగా వివాహ విందు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.