కాపుల రిజర్వేషన్ల బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం....

SMTV Desk 2019-02-08 08:24:50  Andhrapradesh assmelby, BS Reservation bill passed, Social welfare minister, Acchennayudu, AP CM, Chandrababu

అమారావతి, ఫిబ్రవరి 08: గురువారం రాత్రి జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అచ్చేన్నాయుడు కాపుల రిజర్వేషన్లకు ఉద్దేశించిన బలహీన వర్గాల పౌరుల (కాపు రిజర్వేషన్‌) బిల్లును ప్రవేశపెట్టారు. కాగా ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సాధికార సర్వే ప్రకారం జనాభాలో కాపు, ఒంటరి,బలిజ తదితరులు 50 శాతం ఉన్నారని, దీనిని దృష్టిలో ఉంచుకునే ఆర్థికంగా వెనుకబడిన వారికి కేటాయించిన రిజర్వేషన్లలో 5శాతం వారికి కేటాయించినట్లు చెప్పారు. ఈ ఐదు శాతంలో 3 వంతు మహిళలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతకుముదు బిసి సబ్‌ప్లాన్‌ బిల్లుపై సభలో గందరగోళం నెలకొంది. బిల్లు ఆమోదం కోసం బిసి సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం సభలో ప్రతిపాదించగా, బిల్లుపై చర్చలో భాగంగా ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ మాట్లాడుతూ బిసిలకు బడ్జెట్‌లో ఎంత నిధులు కేటాయిస్తున్నారు.

ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారనేది బిల్లులో పొందుపరచలేదని ఈ అంశంపై మంత్రి స్పష్టత ఇవ్వాలని కోరారు. మంత్రి స్పష్టత ఇవ్వలేకపోగా రవికుమార్‌కు తెలివితేటలు ఎక్కువయ్యాయని అసహనం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్‌ జోక్యం చేసుకుని సభ్యులు లేవనెత్తిన అంశాలపై వివరణ తప్పని సరిగా ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన అనంతరం ఈ విషయమై స్పష్టత ఇవ్వడంతో బిల్లును సభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. కాపులు కానట్టి ఆర్ధికంగా బలహీనవర్గాల రిజర్వేషన్ల బిల్లును, ఆంధ్రప్రదేశ్‌ సహకార సంఘాల సవరణ బిల్లు, రైట్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుల్‌ సవరణ బిల్లును, రిజిస్ట్రేషన్స్‌ ఆంధ్రప్రదేశ్‌ సవరణ బిల్లును సభ ఆమోదించింది.