సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాల కేసులు ఎత్తివేత..

SMTV Desk 2019-02-07 21:09:26  Chandrababu, ap govt, samaikyandhra, police cases

అమరావతి, ఫిబ్రవరి 7: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన జరగకుండ ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై, అలాగే విభజన తరువాత ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ ఉద్యమాలలో పాల్గొని కేసులు ఎదుర్కుంటున్న వారికి ఊరటనిచ్చే విదంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాలలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను ఎత్తివేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ సూచించారు.