జోరుగా సాగిన 'మజిలీ' శాటిలైట్ రైట్స్....

SMTV Desk 2019-02-07 20:17:04  Akkineni Nagachaithanya, Akkineni Samanta, Majili movie, Ninnu kori movie, Director Shiva nirvana, Majili satellite rights, Zee Channel

హైదరాబాద్, ఫిబ్రవరి 07: అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి తరువాత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం మజిలీ . నిన్ను కోరి వంటి ఫీల్ గుడ్ సినిమా అందించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య రెండు కోణాల్లో సాగే పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ క్రేజ్ ఏర్పడింది. ఈ నేప‌థ్యంలో శాటిలైట్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ జీ టీవీ ఛానెల్ 6 కోట్ల రూపాయ‌ల‌కు ద‌క్కించుకుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఈ రేటు పెద్ద మొత్తమే. అయితే ఈ రైట్స్ కోసం పెద్ద పెద్ద ఛానెల్స్ అన్ని పోటీ పడినట్లు తెలుస్తోంది. జీ ఛానల్ ఎవరూ ఊహించని రేటుతో సొంతం చేసుకుందని సమాచారం.

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ జీవితంలో ఒకొక్క దశ ఒక్కో మజిలీ. ఒక యువ జంట సాగించిన ప్రేమ మజిలీ వెనక సంఘర్షణ ఎలాంటిదో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు. సమంత, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ చేస్తున్న ఈ చిత్రం రీసెంట్ గా విశాఖపట్నం పరిసరాల్లో రెండు పాటల్ని, కొన్ని కీలక సీన్స్ ని తెరకెక్కించారు. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పనులు శరవేగంగా సాగుతున్నాయి. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు.