రన్ వీర్ కాస్త ఎక్కువైంది...

SMTV Desk 2019-02-07 18:01:11  Ranveer singh, Gullyboy movie, Movie Promotions, Ranveer Singh Jumps Into a Crowd Of Fans, Hurt Few Fans

ముంభై, ఫిబ్రవరి 07: బాలీవుడ్ క్రేజీ హీరో రన్ వీర్ సింగ్ తన గల్లీ బాయ్ సినిమా ప్రమోషన్స్ లో కాస్త వింతగా ప్రవర్తించాడు. అది చూసిన తన అభిమానులు, నెటిజన్లు రన్ వీర్ పై నిప్పులు చెరుగుతున్నారు. విషయానికొస్తే గల్లీ బాయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రన్ వీర్ లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. సినిమాల్లో హీరో పాటలో జనాల మీదకు దూకితే ప్రేమగా మోస్తారని నిజ జీవితంలో కూడా రన్ వీర్ అలానే చేశాడు. అయితే ఈ ట్రిక్ ఫెయిల్ అయ్యింది.

అంతే కాకుండా కొంత మంది లేడి ఫ్యాన్స్ కి గాయాలయ్యాయి. మనోడు చేసిన పనికి అంత మితిమీరిన ఓవరాక్షన్ ఎందుకు చేయడం అంటూ నెటిజన్స్ చురకలంటిస్తున్నారు. కొంచెం కూడా ఆలోచించకుండా అలా ఎందుకు ప్రవర్తించడమని గతంలో ఎప్పుడు లేని విధంగా రణ్ వీర్ తీరుపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.