అడివి శేష్ అనౌన్స్మెంట్ స్టేట్మెంట్....ట్వీట్ వైరల్

SMTV Desk 2019-02-07 17:20:49  Adivi shesh, Goodachari movie, Adivi shesh twitter account, Esha rebba, Actor Brahmaji

హైదరాబాద్, ఫిబ్రవరి 07: హీరోగా, దర్శకునిగా విభిన్న చిత్రాలు తీస్తూ చిన్న వయషులోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అడివి శేష్. ఈ హీరో ప్రస్తుతం టూ స్టేట్స్ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ హీరో ఈ నెలాఖరున గుడ్ న్యూస్ చెప్పబోతున్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అంతే వెంటనే శేష్ పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. దానికి కారణం హీరోయిన్ ఈషా రెబ్బ. ఈ నెలాఖరున గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ప్రస్తుతానికి సస్పెన్స్ అంటూ అడివి శేష్ పెట్టిన పోస్ట్ కి స్పందించిన ఈశా.. పెళ్లి చేసుకోబోతున్నావా..? శేష్ అంటూ రిప్లయ్ ఇచ్చింది.

ఇది చూసిన కమెడియన్ బ్రహ్మాజీ వెంటనే.. ఏంటి ఇంకా పెళ్లి కాలేదా..? అంటూ మరో ట్వీట్ చేశాడు. అలా కాసేపు వీరిమధ్య జరిగిన సరదా సంభాషణకు నెటిజన్లు నవ్వుకున్నారు. ఈషా పెట్టిన రిప్లయ్ కి శేష్ కోపంగా ఉన్న ఎమోజీని పోస్ట్ చేశారు. అంటే అది పెళ్లి విషయం కాదని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇస్తాడో చూడాలి!