కష్టాలు..అవమానాలే..ఉన్నత శిఖరాలకు చేర్చాయి

SMTV Desk 2017-06-01 13:51:02  civils results, topper gopala krishna, third rank in national leval,

హైదరాబాద్, జూన్ 1 : తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ లో టాఫర్ గా నిలిచారు రోణంకి గోపాలకృష్ణ. విలక్షణ వ్యక్తిత్వం..కష్టపడే తత్వం, సాధించాలన్నధృడమైన పట్టుదల, సంకల్పం తనను ఉన్నత శిఖరాలను అందుకునేలా చేశాయి. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ గ్రామానికి చెందిన ఆయన బాల్యం నుండే అడుగడుగునా కష్టాలు.అవమానాలు ఎదుర్కోంటు అయినా మెుక్కవోని దీక్షతో అడుగులు ముందుకు వేశాడు. ముఖ్యంగా సివిల్స్ లో తర్పీద్ కోసమై హైదరాబాద్ వచ్చి అనేక అవమానాలను, చీత్కారాలను ఎదుర్కొన్నానని కన్నీటి పర్యంత మవుతు ఆయన మీడియాకు వివరించారు. ఏ కోచింగ్ సెంటర్ కు వెళ్ళినా నువ్వు పనికి రావంటూ అడ్మిషన్ ఇవ్వలేదని ..దేవుడి దయ, అమ్మనాన్నల దీవెనలు, అన్నయ్య కోదండరావు స్పూర్తి, స్నేహితుల సహాకారంతో పట్టుదలగా చదువానని వెల్లడించారు. బాల్యంలో తాను పడ్డ బాధలు, తల్లిదండ్రుల కష్టాలు చూసి ప్రతీకారంతో విజయాన్ని సాధించానని స్పష్టం చేశారు. తమ గ్రామానికి కరెంట్ లేకపోతే దీపం వెలుగులో చదువుకున్నానని, ఇప్పటికి తమ గ్రామానికి న్యూస్ పేపర్ కూడా అందదని చెప్పారు. పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకూ తెలుగు మీడియంలోనే పలాస మండలంలో గోపాలకృష్ణ విద్యాభ్యాసం కొనసాగింది. దూరవిద్యా విధానంలోఆంధ్రా యూనివర్శిటి నుండి బిఎస్ సి డిగ్రీ పట్టా అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్ల డైట్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది..2007 లో డిఎస్ సి ద్వారా సెకంటరీ గ్రేడ్ టీచర్ గా ఎంపికయ్యారు. ప్రస్తుతం పలాస మండలం రేగులపాడులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 2012లో గ్రూప్-1 లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా సుప్రీంకోర్టు తీర్పుతో ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. ఓ వైపు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే..మరో వైపు 2006 నుండి సివిల్స్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు. నాలుగో ప్రయత్నంలో తన కల సాకారం చేసుకున్నాడు. తెలుగు మీడియంలోనే చదివి అఖిల భారత స్థాయిలో ర్యాంక్ సాధించడం అద్భుత విజయమని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.