ముగిసిన ఆమంచి, చంద్రబాబు భేటీ..

SMTV Desk 2019-02-07 16:15:47  amanchi krishnamohan, tdp, chandrababu, chirala, ap elections 2019

అమరావతి, ఫిబ్రవరి 7: 2014 ఎన్నికలలో చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కాగా తాను ఇప్పుడు టీడీపీలో కొనసాగుతాడా లేదా పార్టీ మారుతారా అనే విషయంపై అమంచి కృష్ణమోహన్ స్పష్టం చేయలేదు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడితో భేటీ తర్వాత కూడా ఏ విషయమూ తేల్చలేదు. సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తాను చెప్పిన విషయాలను సానుకూలంగా విన్నారని కృష్ణమోహన్ అన్నారు. ఏ పార్టీలో కొనసాగాలనేది తన అనుచరులతో, స్నేహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తాను ఒక్కడినే ఏ నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేసారు. కాగా మొదట్లో తాను టీడీపితో గొడవ పడ్డానని, ఆ తర్వాత టీడీపిలో చేరానని ఆయన చెప్పారు.ఇక చంద్రబాబుతో అన్ని విషయాలు చర్చించినట్లు ఆయన తెలిపారు. తన నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలపై చంద్రబాబుకు వివరించానన్నారు. తొలుత ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్దపడ్డారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనతో మంత్రి శిద్ధా రాఘవరావు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆమంచి చంద్రబాబును కలిసారు. అయితే ఆమంచి ఏ పార్టీలో చేరేది ఇంకా స్పష్టం చేయలేదు.