'మజిలి'లో నాగచైతన్య టూ షేడ్స్...

SMTV Desk 2019-02-07 15:57:22  Akkineni nagachaithanya, Akkineni samantha, Majili movie, Director shiva nirvana, Eh maya cheshave, Manam, Auto nagar surya

హైదరాబాద్, ఫిబ్రవరి 07: అక్కినేని నాగ చైతన్య, సమంత ఇదివరకు చాలా సినిమాల్లో కలిసి నటించారు కానీ వీరి పెళ్లి తరువాత ఈ కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. కాగా పెళ్లి తరువాత మొదటి సారి ఇద్దరు కలిసి మజిలి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భార్య‌భ‌ర్త‌ల బంధం, వారి భావోద్వేగాలు నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా రెండు కోణాల్లో సాగే పాత్ర‌లో నాగ‌చైత‌న్య క‌నిపిస్తున్నాడు.

కాగా ఇటీవ‌ల విశాఖపట్నం పరిసరాల్లో రెండు పాట‌ల్ని, క‌థ‌లో కీల‌కంగా వ‌చ్చే కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఐదేళ్ళ గ్యాప్ త‌రువాత చైతూ, సామ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా `ఏమాయ చేసావె`, `మ‌నం` స్థాయిలోనే ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం. క్రికెట‌ర్ పాత్ర‌లో నాగ‌చైత‌న్య న‌టిస్తున్న ఈ సినిమాలో గృహిణి పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నుండ‌గా మ‌రో క‌థానాయిక‌గా దివ్యాంశ కౌశిక్ న‌టిస్తోంది. వేస‌వి సంద‌ర్భంగా ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.