జపాన్ లా మారకూడదు: చంద్రబాబు

SMTV Desk 2019-02-07 15:13:05  Chandrababu, Andra pradesh, Japan China, Robos

అమరావతి, ఫిబ్రవరి 07: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో జనాభా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు శాసనమండలిలో చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ మరో జపాన్ లా కాకూడదని చెప్పారు. మనుష్యులు తగ్గిపోతే రోబోలు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అయ్యాన పేర్కొన్నారు. పిల్లలను కనడం వల్ల రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పారు. అభివృద్ధి చెందామనే భావనతో పిల్లలను వద్దనుకోవడం సరికాదని అన్నారు. పిల్లలను వద్దనుకోవడం వల్ల జపాన్ చైనా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని తెలిపారు. వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువతరం తగ్గిపోయి తీవ్ర సమస్యలు పడుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అలాంటి పరిస్థితి రాకుడని అన్నారు.