పవన్ కు రాజకీయం నేర్పిస్తున్న గంటా..

SMTV Desk 2019-02-07 14:54:24  Pavan kalyan, Ganta srinivasa rao, janasena, tdp, ganta comments

అమరావతి, ఫిబ్రవరి 07: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే తను నటించే సినిమా కాదని ఎద్దేవా చేశారు. సినిమాల్లో స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత... డైరెక్టర్ స్టార్ట్, యాక్షన్ అంటే యాక్టర్స్ నటిస్తారని... రాజకీయాల్లో అలా ఉండదని చెప్పారు. మొదట రాజకీయ నేతలు నాలెడ్జ్ పెంచుకోవాలని హితవు పలికారు.

ఇక పేపర్ పై ఎవరో ఏదో రాసిస్తే... దాన్ని చూసి మాట్లాడటం మానుకోవాలని ఆయన సూచించారు. కాగా పరిజ్ఞానం, అవగాహన పెంచుకున్న తర్వాత పవన్ కల్యాణ్ మాట్లాడితే బాగుంటుందని అన్నారు. తాను దేశం గర్వించదగ్గ నాయకుడు ఉన్న పార్టీలో ఉన్నానని... జనసేనలోకి తాను వెళ్లాల్సిన అవసరం లేదని గంటా శ్రీనివాసరావు తెలిపారు.