మా గదిలో మరొకరు ఉన్నారు...

SMTV Desk 2019-02-07 11:52:03  Priyanak chopra, Nick jonas, Instagram, Social Media, Twitter

హైదరాబాద్, ఫిబ్రవరి 07: ప్రియాంక చోప్రా ఇటీవల ట్విట్టర్ లో తన భర్త నిక్ జోనస్ తో ఏకాంతంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో సామజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. స్వయంగా ప్రియాంక చోప్రానే ట్విటర్‌లో ఫొటో పోస్ట్ చేసినప్పటికీ..అసలు ఆ ఫోటో తీసారన్న దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగుతోంది. ఆ ఫోటో తీసిన మూడో వ్యక్తి ఎవరని కామెంట్స్ చేస్తున్నారు. అలెక్సా, జాన్ సీనా అంటూ ఎవరికి నచ్చిన పేర్లను వారు షేర్ చేస్తున్నారు. సీసీ ఫుటేజీ నుంచి స్క్రీన్ షాట్ తీశాని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు.

ఈ నేపథ్యంలో అందరి అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టదానికి స్వయంగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ స్పందించారు. ఆ ఫోటో వెనక కథను నిక్ జోనస్ ఇన్‌స్టగ్రామ్ ద్వారా వివరించారు. గదిలో తమతో పాటు ఫ్రెండ్ కూడా ఉన్నాడని పేర్కొన్నారు. అతడే ఆ ఫోటో తీసాడని చెప్పుకొచ్చారు. దాంతో పాటు తమ స్నేహితుడిని ఆటపట్టిస్తున్న ఒక వీడియో ని కూడా షేర్ చేసారు.