పేటీఎం నుంచి మెసేజింగ్ సేవ‌లు..?

SMTV Desk 2017-08-02 14:33:23  PAYTM INTRODUCE MESSENGER APP

హైదరాబాద్, ఆగష్టు 2 : వాట్సాప్ లో మాదిరిగా పేటీఎం కూడా ఓ మెసేజింగ్ సర్వీస్‌ యాప్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపించుకునేందుకు వీలుగా త్వరలోనే ఒక మెసేజింగ్ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి వాట్సాప్ ప్రతినిధి బ్రయాన్ యాక్టన్, కేంద్ర ఐటీ మంత్రి ర‌విశంక‌ర్ ప్రసాద్‌ను గ‌త ఫిబ్రవరిలో క‌లిశారు. వీటితో పాటు దేశీయ మెసేజింగ్ యాప్ "హైక్" కూడా డిజిట‌ల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా దేశ‌వ్యాప్తంగా పేటీఎం, వాట్సాప్ వినియోగ‌దారులు దాదాపుగా స‌మానంగా ఉన్నారు. ఈ రెండు యాప్స్ త‌మ కొత్త సేవ‌ల‌ను ప్రారంభించ‌డం ద్వారా పెరిగే పోటీ వ‌ల్ల వినియోగ‌దారుల‌కు మ‌రింత మేలు చేకూరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే వాట్సాప్ కూడా మెసేజింగ్ స‌ర్వీస్‌తో పాటు డిజిట‌ల్ పేమెంట్లను కూడా చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.