పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటెన్ చేస్తున్న పూజ..

SMTV Desk 2019-02-06 21:21:29  Pooja hegde, DJ Movie, Aravinda sametha movie, NTR, Allu arjun, Maharshi movie, Mahesh babu, Lakme fashion

హైదరాబాద్, ఫిబ్రవరి 06: అరవింద సమేత లో జూ. ఎన్టీఆర్ సరసన నటించి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది పూజాహెగ్డే. అంతకు ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా DJ(దువ్వాడ జగన్నాధం) లో కూడా హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న మహర్షి సినిమాలో కూడా ఆ బ్యూటి ఛాన్స్ కొట్టేసింది. ఇండస్ట్రీకి వస్తూనే యువ హీరోల సరసన, టాలీవుడ్ స్టార్ హీరోల సరసన కూడా చాన్స్ లు కొట్టేస్తోంది పూజ. అంతేకాక బాలీవుడ్‌లో పలు భారీ చిత్రాలకు కమిట్‌ అవుతోంది.

ఇంత బిజీగా ఉన్నా రెగ్యులర్‌గా ఈ అమ్మడు ఫొటోషూట్లతో సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ముంబైలో లాక్మే ఫ్యాషన్‌ ఈవక్‌లో 2019లో అదిరిపోయే క్యాట్‌ వాక్‌ చేసి ఔరా అన్పించింది. ఒక క్షణంలో హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉంటే మరో క్షణం విదేశీ లొకేషన్‌లో ప్రత్యక్షమవుతోంది. ఆ తర్వా త ముంబైలో ఎలా వాలిపోతుందో తెలియటం లేదని అంటున్నారు. ఈ అమ్మడి టైమింగ్‌ చాలాడిఫరెంట్‌ అంటూ పొగిడేస్తున్నారు..