బెస్తవాని గెటప్ లో మెగా అల్లుడు

SMTV Desk 2019-02-06 21:08:07  Viashnav tej, Saidharamtej, Mythri movie makers, Sukumar, Director Buchhibabu sana

హైదరాబాద్, ఫిబ్రవరి 06: మెగా అల్లుడు సాయిధరమ్‌తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌తేజ్‌ హీరోగా పరిచయమవుతూ కొత్త డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వాస్తవిక ప్రేమకథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం బెస్తవాళ్ల బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది.

ఈ చిత్రం ప్రారంభోత్సవం రోజు యూనిట్‌ విడుదల చేసిన పోస్టర్‌లోకూడ వైష్ణవ్‌తేజ్‌ పూర్తిస్థాయి మాస్‌లుక్‌లో బెస్తవాడిగా అద్భుతంగా ఉన్నారు. కాగా ఈ సినిమాకు రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.