బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక..

SMTV Desk 2019-02-06 19:37:36  rahul gandhi, Priyanka Gandhi, AICC General Secretary, take charge

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 06: 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు పార్టీ ప్రధాన కార్యలయంలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఢిల్లీలోని అక్బర్‌ రోడ్‌ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌ చాంబర్‌ పక్కనే ప్రియాంక కార్యాలయం ఏర్పాటు చేశారు.

కాగా, ప్రియాంక బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే(గురువారం) తొలి అధికారిక సమావేశంలో పాల్గొంటారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన వ్యూహాలను రూపొందించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లతో జరిగే ఈ సమావేశానికి ప్రియాంక హాజరుకానున్నారు.