పూరి కోసం సగం తగ్గించిన రామ్...!

SMTV Desk 2019-02-06 18:32:58  Ram pothineni, Puri jagannad, Ishmart Shankar Movie, Remuneration

హైదరాబాద్, ఫిబ్రవరి 06: సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోకైనా హిట్ ఉంటేనే ముందు సినిమాలకు భారీ రెమ్యూనరేషన్ ఉంటుంది. ఒకవేళ హిట్ లు లేకపోతె మాత్రం ఎంత పెద్ద స్టార్ అయినా నిర్మాతలు చెప్పింది వినాల్సిందే. ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పరిస్తితి కూడా అలాగే ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాను రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ కి ఒక్క హిట్టు కూడా లేకపోవడంతో ఆయనతో రిస్క్ చేసే నిర్మాతలు లేక ఆయనే సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు రామ్ కూడా ఈ సినిమా కోసం తనవంతు సహాయం చేయాలనుకుంటున్నాడట. రామ్ పారితోషికం రెండున్నర నుండి మూడు కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ ని సగానికి సగం తగ్గించుకుంటున్నాడని సమాచారం. అది కూడా పూరి కోసమేనని తెలుస్తోంది. సినిమా హిట్ అయ్యి లాభాలు వస్తే అప్పుడు రామ్ కి పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ చెల్లించే అవకాశాలు ఉన్నాయి.