చరణ్ పై బోయపాటి సీరియస్...

SMTV Desk 2019-02-06 18:09:28  Ram charan, Boyapati seenu, Vinaya vidheya rama movie, Ram charan Facebook post

హైదరాబాద్, ఫిబ్రవరి 06: రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టి తరువాత వినయ విదేయ రామ సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగా హీరో రామ్ చరణ్. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటి కియార అద్వాని హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో రామ్ చరణ్ అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. అలాగే రామ్ చరణ్ కూడా దానికి ప్రతీకగా తన అభిమానులకు ఓ లెటర్ రాసిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఫ్లాప్ అయిన ఏ సినిమాకు రియాక్ట్ అవ్వకుండా వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ పై రియాక్ట్ అవ్వడం దర్శకుడు బోయపాటి శ్రీనుని బాధిస్తోందట. ఈ లెటర్ కి సంబంధించి తన సలహా తీసుకోకపోవడం, లేఖలో ఎక్కడా తన పేరు ప్రస్తావించకపోవడంతో బోయపాటి అలిగారట.

చరణ్ కూడా లేఖలో నిర్మాత దానయ్య పేరు ప్రస్తావించారే తప్ప బోయపాటి టాపిక్ అసలు తీసుకురాలేదు. దీంతో చరణ్ పై బోయపాటి గుర్రుగా ఉన్నట్లు టాక్. వినయ విధేయ రామ సినిమా తరువాత రామ్ చరణ్, బోయపాటి మధ్య బాగా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన తరువాత ఇద్దరూ ఒకసారి కూడా కలుసుకోలేదట. అందుకే లెటర్ విషయంలో చరణ్ సొంతంగా నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అయితే బోయపాటి మాత్రం ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మిగిలిన వారి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదా.. సినిమా అనేది అందరి కృషి అంటూ తన సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.