టాలీవుడ్ డైరెక్టర్స్ అంటే నాకు నచ్చదు...!

SMTV Desk 2019-02-06 17:23:30  Actress Amritarao, Athithi movie, Mahesh babu, Tollywood Directors

హైదరాబాద్, ఫిబ్రవరి 06: 2007లో వచ్చిన అతిథి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ బ్యూటి అమృతారావు. ఈ సినిమా తరువాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు ఈ బ్యూటి. ఈ హీరోయిన్ తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా మాట్లాడుతూ టాలీవుడ్ డైరెక్టర్ల పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ అమ్మడు. టాలీవుడ్ దర్శకులు హీరోయిన్ల పాత్రలను చూపించే విధానం తనకు నచ్చదని స్పష్టం చేసింది.

హీరోయిన్లను కేవలం వస్తువులలాగే చూపిస్తారని సంచలన కామెంట్స్ చేసింది. అలాంటి పాత్రలు తనకు కరెక్ట్ కాదనిపించి తెలుగు సినిమాల్లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. మహేష్ అతిథి సినిమాలో ఎందుకు నటించిందనే విషయంపై కూడా కామెంట్ చేసింది. సినిమాలో తన పాత్ర మహేష్ బాబు రోల్ కి సమానంగా ఉంటుందని ఆ కారణంగానే సినిమా ఒప్పుకున్నట్లు చెప్పింది. ఈ బ్యూటీకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఇటీవల థాక్రే సినిమాలో మీనాతాయ్ పాత్రలో అమృత నటించింది.