సాహో లేటెస్ట్ అప్ డేట్...!

SMTV Desk 2019-02-06 17:10:00  Prabhas, Sujeeth, Saaho, Saaho movie, Neel Nithin, Shradda Kapoor, Ramojifilm city, Abudabi, Ran raja ran movie

హైదరాబాద్, ఫిబ్రవరి 06: రెబల్ స్టార్ పభాస్ రన్ రాజా రన్ ఫేం దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ బాహుబలి తరువాత మరో భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్న సినిమా ఇది. రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో యాభై శాతం ఖర్చు యాక్షన్ సన్నివేశాలకే కేటాయించారట. గతంలో అబుదబిలో భారీ యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించారు. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన కీలక పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ సన్నివేశాలను ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్ బ్రిడ్జ్ పై తెరకెక్కించాలని అనుకున్నారు.

కానీ దానికి అధికారులు అనుమతించకపోవడంతో ఆ బ్రిడ్జ్ ని భారీ సెట్ గా వేసి రామోజీ ఫిలిం సిటీలోనే చిత్రీకరించాలని అనుకున్నారు. సాబు సిరిల్ నిర్మించిన ఈ ఒక్క సెట్ కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెట్ లోనే ప్రభాస్, నీల్ నితిన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మార్చి నాటికి ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఆగస్ట్ 15న సినిమా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది!