'కేజిఎఫ్' క్రేజ్ ఇంకా తగ్గలేదు...

SMTV Desk 2019-02-06 16:54:20  KGF Movie, Yash, Director Prashanth neel, Amazon prime video

హైదరాబాద్, ఫిబ్రవరి 06: తెలుగు, తమిళ, హిందీ, కన్నడ తదితర భాషల్లో భారీ స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న సినిమా కేజిఎఫ్ . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా అమెజాన్ లో వచ్చిన ఈ సినిమాకు మరోసారి బారి స్పందన వచ్చింది. చూసిన వారు మరోసారి అమెజాన్ ప్రైమ్ లో తెగ చూసేస్తున్నారు. ఇప్పటికి KGF థియేటర్స్ లో తెగ ఆడుతోంది. బాహుబలి అనంతరం ఒక డబ్బింగ్ సినిమా హిందీ ఇతర భాషల్లో భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.

250 కోట్ల కలెక్షన్స్ ని దాటడమే కాకుండా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కోట్ల సంఖ్యలో జనాలు సినిమాను మరోసారి వీక్షించారు. బాహుబలి అనంతరం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ఎక్కువా మంది KGF నే టార్గెట్ చేశారు. మొత్తానికి బాగాలేదని చెప్పిన రివ్యూలకు ఇది మాములు దెబ్బ కాదనే చెప్పాలి. ఒక సినిమా ఆడియెన్స్ కి నచ్చితే దాన్ని ఎవడు ఆపలేడని KGF నిరూపించింది.