'ఉన్న‌ది ఒకటే జిందగీ' రికార్డు...

SMTV Desk 2019-02-06 16:28:06  Ram Pothineni, Unnadi Okkate Zindagi, No1 Dilwala, Lavanya tripati, Anupama parumeshwaran, Sree ram vishnu, Kishore Tirumala, Gold mines telefilms

హైదరాబాద్, ఫిబ్రవరి 06: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా ఉన్న‌ది ఒకటే జిందగీ . లావణ్య త్రిపాఠి , అనుపమ, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను హిందీలో నెం.1 దిల్ వాలా అనే టైటిల్ తో డబ్ చేసి పెట్టారు. అయితే సినిమా పెట్టిన మూడు రోజులకే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇంత‌కు పూర్వం హిందీలో విడుద‌లైన ఏ సినిమాకు కూడా మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ స్నేహం విలువ‌ను చెప్పే అంద‌మైన ప్రేమ క‌థా చిత్రం. స్నేహితులుగా రామ్‌, శ్రీ విష్ణు న‌టించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ప్రియ‌ద‌ర్శి, కిరీటి దామ‌రాజు అల్ల‌రిమాట‌లు న‌వ్వులు పంచాయి. స్ర‌వంతి సినిమాటిక్స్ ప‌తాకంపై స్ర‌వంతి ర‌వికిశోర్, కృష్ణ చైత‌న్య‌ సంయుక్తంగా నిర్మించిన చిత్ర‌మిది. దేవిశ్రీ ప్ర‌సాద్ స‌మ‌కూర్చిన బాణీలు, నేప‌థ్య సంగీతం సినిమాకు హైలైట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని హిందీలో గోల్డ్ మైన్స్ టెలీ పిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై మ‌నీష్ షా విడుద‌ల చేశారు. యూట్యూబ్‌లో పెట్టిన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌డం ప‌ట్ల హిందీ అనువాద హ‌క్కులు తీసుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ మ‌నీష్ షా ఆనందం వ్య‌క్తం చేశారు.