ఒప్పో నుండి మరోకొత్త ఫోన్

SMTV Desk 2019-02-06 15:42:47  Oppo mobile, oppo k1, new features, mobiles, 25 mega pixel selfie camera, oppo new launch

ప్రముఖ మొబైల్స్ సంస్థ ఒప్పో తన కొత్త మొబైల్ oppo k1" ని విడుదల చేసింది. ఈ రోజు అనగా ఫిబ్రవరి 6 న న్యూఢిల్లీలో జరిగిన ఈవెంట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఒప్పో కె1 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 6.41 అంగుళాల భారీ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్‌ సపోర్ట్‌తో పనిచేయనుంది. ఈ ఫోన్‌లో చెప్పుకోదగ్గ ఫీచర్ ఏదంటే అది సెల్ఫీ కెమెరా నే.. 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తో ఈ ఫోన్ ముందు భాగం తయారు చేయబడింది. ఇక వెనుకభాగంలో 16, 2 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు అమర్చారు. ఈ ఫోన్ ముందుభాగంలో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌‌ను ఏర్పాటు చేయడం విశేషం.

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీతో విడుదలైన ఈ ఫోన్ పియానో బ్లాక్, ఆస్ట్రల్ బ్లూ వేరియంట్లలో వినియోగదారులకు లభ్యం కానుంది. గతేడాది అక్టోబరులోనే ఒప్పో కె1 ఫోన్‌ను చైనాలో లాంచ్ చేశారు. అక్కడ ఈ ఫోన్‌కు సంబంధించి 4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్ రెండు వేరియంట్లను విడుదల చేయగా, భారత్‌లో మాత్రం కేవలం 4 జీబీ ర్యామ్ వేరియంట్‌ను మాత్రమే విడుదల చేశారు. త్వరలోనే 6 జీబీ ర్యామ్ వేరియంట్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది.

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ కలిగిన ఈ ఫోన్‌ ధరను భారత్‌లో రూ.16,990/- గా ఒప్పో నిర్ణయించింది. పియానో బ్లాక్, ఆస్ట్రల్ బ్లూ వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ మొదటి సేల్‌ను ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిఫ్‌కార్ట్‌ ద్వారా నిర్వహించనున్నారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా సిటీబ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఫోన్ కొనగోలుపై 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. నోకాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. ఇక ఫ్లిప్‌కార్ట్ నుంచి బైబ్యాక్ గ్యారంటీ (90%), కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్రయోజనాలు అందనున్నాయి.

✦ 6.41 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే
✦ 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
✦ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌
✦ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
✦ 4/6 జీబీ ర్యామ్‌
✦ 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
✦ 16+2 మెగాపిక్సల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
✦ ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
✦ డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ
✦ డ్యుయ‌ల్ సిమ్‌
✦ డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
✦ బ్లూటూత్ 5.0
✦ 3600 ఎంఏహెచ్ బ్యాట‌రీ.