మోదీ హఠావో దేశ్ బచావో: టీడీపీ ఎంపీలు

SMTV Desk 2019-02-06 15:16:05  TDP MPs, Narendra Modi, Murali Mohan, Kanakamedala Ravindra Kumar, Parliament

అమరావతి, ఫిబ్రవరి 06: ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ(టీడీపీ) ఎంపీలు విమర్శించారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను నేరవేర్చలంటూ పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. మోదీ హఠావో దేశ్ బచావో అంటూ ఎంపీలే నినదించారు. ఈ సందర్భంగా ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ, గుజరాత్ తో పాటు తన అనుకూల రాష్ట్రాలకే మోదీ నిధులు కేటాయిస్తున్నారని, కొన్ని రాష్ట్రాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరో టీడీపీకి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన పరిస్థితిని మోదీ తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.