దగ్గుపాటి వారింట్లో పెళ్లి బాజాలు...!

SMTV Desk 2019-02-06 15:10:52  Venkatesh, Ashitha, Marriage, engagement, Rajamouli, Karthikeya

హైదరాబాద్, ఫిబ్రవరి 06: టాలీవుడ్ మరో వివాహ వేడుకకు సిద్ధమవుతోంది. ఇటీవల రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం వైభవంగా రాజస్తాన్ లో జరిగింది. దీనికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు హీరో వెంకటేష్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేష్ పెద్ద కూతురు దగ్గుపాటి ఆశిత హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి మనవడితో నిశ్చయమయింది. తాజాగా నిశ్చితార్థం, పెళ్లి ముహూర్థం తేదీలు ఖరారైనట్లు సమాచారం.

ఈరోజు వారి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. మర్చి 1న వీరి వివాహం జరగనుందని సమాచారం. అయితే విరిద్దరిది ప్రేమ వివాహం అని పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య కొంతకాలంగా స్నేహం ఉందని, ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైనట్లు సమాచారం.