నిర్మాతలకు టాలీవుడ్ హీరోల డిస్కౌంట్లు...!

SMTV Desk 2019-02-06 14:20:29  Ram, Ravi Teja, Remunaration, iSmart Shankar

హైదరాబాద్, ఫిబ్రవరి 06: టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ను బట్టి హీరోల పారితోషకంలో మార్పులు వస్తూ ఉంటాయి. హిట్లు లేకపోతే హీరో పారితోషకం తగ్గిపోతుంది. మళ్ళీ సక్సెస్ రాగానే హీరోల విలువలు అమాంతం పెరిగిపోతుంటాయి. ఇలా హీరోల మార్కెట్లో అప్పుడప్పుడు మార్పులు జరుగుతుంటాయి. తాజాగా వరుస పరాజయాలతో మాస్ హీరో రవి తేజ మార్కెట్ అమాంతం పడిపోయింది. దాంతో ఆయన తన తర్వాతి సినిమా కోసం తన రెమ్యునరేషన్ ని తగ్గించుకున్నాడు.

అయితే ఇప్పుడు హీరో రామ్ కూడా తన పారితోషకం తగ్గించుకునే యోచనలో ఉన్నాడు. ప్రస్తుతం రామ్ నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకి రామ్ పారితోషికం దాదాపు 3 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. ఆ పారితోషికంలో స‌గానికి స‌గం త‌గ్గించుకున్న‌ట్టు తెలుస్తోంది. సినిమా క్వాలిటీతో తీయాలనే ఉదేశ్యంతోనే రామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతకు కొంత వ్యయ భారం తగ్గుతుంది. సినిమా విడుదలైన తర్వాత హిట్ అయితే అప్పుడు రామ్ కి మొత్తం పారితోషికం చెల్లించబడుతుంది.