అవినీతి రాజు, దొంగబ్బాయి మాత్రం కనిపించలేదు: లోకేశ్

SMTV Desk 2019-02-06 13:48:37  Nara Lokesh, Chandrasekhar Rao, Jaganmohan Reddy, Narendra Modi, Mamatha Banerjee, Fedaral Front, BJP, TDP, TSR, TMC

అమరావతి, ఫిబ్రవరి 06: ఆంద్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ లను తీవ్రంగా విమర్శించారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ ప్రధాని మోదీకి రెండు కళ్ళ వంటివారని, వారు మోడీ కి బీ-టీమ్ గా ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఈరోజు మంత్రి లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ పశ్చిమబెంగాల్ సీఎం మమతా దీదీకి మద్దతుగా కోల్ కతా ర్యాలీలో పాల్గొంటే, ఫెడరల్ ఫ్రంట్ కు సుప్రీం లీడర్ అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి, అవినీతి రాజు అయిన దొంగబ్బాయి మాత్రం కనిపించలేదు. వీరిద్దరూ మోదీ బీ-టీమ్ అనడానికి ఇంతకంటే ఆధారం ఏం కావాలి అని ట్వీట్ చేశారు.