స్టార్ హీరోల సినిమాల షూటింగ్ లన్నీ ఒకేచోట...!

SMTV Desk 2019-02-06 12:59:14  Prabhas, Ram Charan, Balakrishna, Ramoji film City, Rajamouli

హైదరాబాద్, ఫిబ్రవరి 06: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మద్యనే కొన్ని కీలక సన్నివేశాలను విదేశాలలో చిత్రీకరించారు. ఇప్పుడు ఈ సినిమా టీం షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకుంది. ప్రభాస్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు.

మరోవైపు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా రామోజీ ఫిలిం సిటీలోనే జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే రామోజీ ఫిలిం సిటీలోనే బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న మహానాయకుడు కూడా చిత్రీకరణ జరుపుకుంటుంది. మొత్తానికి పెద్ద హీరోల సినిమాలన్నీ ఒకే లొకేషన్ లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నాయి.