ఈ సీత కొంచెం డిఫరెంట్...!

SMTV Desk 2019-02-06 10:34:58  Bellamkonda Srinivas, Kajal, teja, Seetha

హైదరాబాద్, ఫిబ్రవరి 06: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సీత . ఈ సినిమాలో కథానాయికగా కాజల్ నటిస్తోంది. టైటిల్ కి తగ్గట్టు ఈ సినిమాలో కాజల్ సీత పాత్రలో పద్దతిగా, సున్నితంగా కనిపిస్తుందని అంచనా వేసారు. కానీ సినిమాలో ఆమె పాత్ర టైటిల్ కి పూర్తి విరుద్ధంగా ఉంటుదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీత పాత్ర విభిన్నంగా ఉంటుందట.

ఈ పాత్ర ఎవరిని లెక్క చేయకుండా తన ఇష్టానికి తనకు నచ్చింది చేసుకుంటూ పోతుందట. మొత్తానికి సీత అనే పేరుకి పూర్తి విభిన్నంగా ఈ పాత్ర డిజైన్ చేయబడింది. హీరో పాత్ర విషయానికొస్తే అమాయకంగా ఉంటూ సీత ఏది చెప్తే అది వినేతట్టు ఉంటాడట. ఈ సినిమాలో ఎక్కువగా మూడు పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వగా అందులో సోనుసూద్ పాత్ర ఒకటి. సోనుసూద్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ కథలో హీరో కంటే హీరోయిన్, విలన్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.