వైస్సార్సీపీ లోకి మరో మాజీ మంత్రి

SMTV Desk 2019-02-06 08:41:24  Khaleel basha, Ysrcp, Tdp, Kadapa, Ex minister, joining in ysrcp

హైదరాబాద్, ఫిబ్రవరి 06: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ సంబందించిన సీనియర్ నేతలు, ఎమ్మెల్యే లు, మాజీ మంత్రులు అదును చూసి పార్టీ ని వీడుతున్నారు. ఇపుడు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఖలీల్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వచ్చిన ఆయన జగన్ తో భేటీ అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖలీల్ ను పార్టీలోకి ఆహ్వానించిన జగన్, స్వయంగా వైకాపా కండువాను కప్పారు. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషాతో కలిసి జగన్ నివాసానికి వచ్చిన ఖలీల్ బాషా , కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఖలీల్ చేరికతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అయిందని వైకాపా నేతలు అభిప్రాయపడ్డారు.