ప్రయాణికుల కోసం డిల్లీ మెట్రోలో మార్పులు

SMTV Desk 2019-02-06 08:16:23  New Delhi, Delhi metro rail corporation, Additional coaches for Delhi metro, RTI

న్యూడిల్లీ, ఫిబ్రవరి 06: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించే లక్షలాది ప్రయాణికులకు నిరంతర సేవలందిస్తోంది. మెట్రో రైల్ లో ప్రయాణించడం వల్ల సమయం వృధా కాకపోవడంతో ప్రయాణికులు ఎక్కువగా మెట్రో రైల్ లో ప్రయాణం చేయడానికే ప్రాదాన్యత ఇస్తున్నారు. దీంతో మెట్రో రైల్ లో ప్రయాణించే వారి సంఖ్యా రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యం లో మెత్రోలలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు తరువాతి మెట్రో కోసం ఎదురు చూస్తూ సమయం వృధా చేసుకోవాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మెట్రోలలోని కోచ్‌ల సంఖ్య పెంచాలని భావిస్తోంది. ఈ క్రమంలో వివిధ లైన్లలో ప్రయాణించే మెట్రోలకు 156 నూతన కోచ్‌లను కలుపనున్నారు. దీనివలన అదనంగా మొత్తం 27 లక్షల మంది ప్రయాణీకులు మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. ఈ మేరకు ఢిల్లీ రైల్ కార్పొరేషన్ ఆర్టీఐ కి వివరాలు పంపించింది. ఈ కోచ్ లను ఏర్పాటు చేయడం వాల్ల కీలక సమయాల్లో మెట్రో రైల్ రద్దీ కొంతమేరకు తగ్గుతుందని అధికారులు వెల్లడించారు. ఈ కోచ్‌లను ఎల్లో లైన్, బ్లూ లైన్, రెడ్ లైన్, ఆరెంజ్ లైన్‌ల కోసం కొనుగోలు చేయనున్నారు.