బెంగాల్ ముఖ్యమంత్రిని కలిసిన చంద్రబాబు

SMTV Desk 2019-02-05 18:07:06  Chandrababu Naidu, Mamatha Banerjee, Narendra Modi, Amit Shah, TDP, BJP, TMC

కొలకత్తా, ఫిబ్రవరి 05: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొలకత్తా లో నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీ భావం తెలిపేందుకు ఈరోజు మధ్యాహ్నం ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యం లో ఆయన మాట్లాడుతూ బీజేపీ అన్ని విపక్ష పార్టీలను నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు.

చంద్రబాబు ఈ ధర్నాకు మద్దతు తెలిపారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాల్లో అభివృద్ధిని అడ్డుకోవాలని కేంద్రం చూస్తోందని, ఏపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అభివృద్ధిని అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, దేశ భవిష్యత్తు కోసం 23 పార్టీలు ఏకమయ్యాయని మరోసారి తెలియజేశారు. ఇక నుండి ఏ నిర్ణయం అయిన కలిసికట్టుగా తీసుకుంటామని తెలిపారు. కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వాన్ని తాము ఎన్నడు చూడలేదని, ఎన్డీఏ ప్రభుత్వ చర్యల వల్ల దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతోందని, నరేంద్ర మోదీ, అమిత్ షా మినహా మిగతా వారంతా అవినీతిపరులనే ముద్ర వేస్తున్నారని ఆరోపించారు.