ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం టీవీ యాంకర్ ప్రయత్నాలు....!

SMTV Desk 2019-02-05 18:06:37  TV Anchor, Andhrapradesh assembly elections, MLA Ticket, Actress, YSRCP

హైదరాబాద్, ఫిబ్రవరి 05: బుల్లితెరపై సందడి చేసే ఓ టీవీ యాంకర్ ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తోందని టాక్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడం కోసం సదరు యాంకర్ బాగానే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. బుల్లితెర కామెడీ షోతో బాగా పాపులర్ అయిన ఆ భామ సినిమాల్లో ప్రస్తుతం కూడా తన సత్తా చాటుతోంది. ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఓ సీనియర్ పొలిటీషియన్ సహాయం కూడా తీసుకుంటుందట.

వైఎస్సార్ సీపీ పార్టీ ఎమ్మెల్యేగా సేవలు నిర్వహిస్తోన్న సీనియర్ నటితో ఈ హాట్ యాంకర్ మంతనాలు సాగిస్తోందట. అయితే ఈసారి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినా.. లాభం లేదని కొందరు అంటున్నారు. అయితే ఆ యాంకర్ ఎవరనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా వైఎస్సార్ సీపీ పార్టీ తరఫున పోటీ చేయాలనే ఈ హాట్ యాంకర్ కల నెరవేరడం కష్టమని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!