ఉద్యోగులకు ఏపి ప్రభుత్వం శుభవార్త

SMTV Desk 2019-02-05 16:23:20  Andhra Pradesh, Vote on account budget, AP Assembly Meeting, Employee Schemes

అమరావతి, ఫిబ్రవరి 05: ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టిడిపి ప్రభుత్వం ప్రజలను ఆకట్టుకునే విధంగా బడ్జెట్ ను రూపొందించారు. ఇందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలని తీసుకుంది.

వేరే చోట నివసించే ప్రభుత్వోద్యోగులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త పెన్షన్ స్కీమ్ లో మార్పులకు కమిటీ ఏర్పాటు చేసారు. ఉద్యోగులకు గ్రాట్యూటీతో పాటు కుటుంబం పెన్షన్ ఇవ్వనున్నారు. 70 ఏళ్లు దాటిన పెన్షన్ దారులకు 10 శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనున్నారు. కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. లెక్చరర్స్ కు టైమ్ స్కేల్, పీఆర్ సీ బకాయిల చెల్లింపు, నగదు రహిత హెల్త్ స్కీమ్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

8 కోట్ల 2 లక్షల 80 వేల ఉద్యోగులకు వేతనం. పుల్ టైమ్, డైలీ, కాన్సలిడేటేడ్ పార్ట్ టైం ఉద్యోగులపై 2015 నాటి కనీస వేతన స్కీమ్ కు మార్పు. అర్చకులు, అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు వెతనన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీఆర్ఏ, వీఆర్ఓలకు కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 15 వేలు వేతనం పెంచాలని నిర్ణయించారు.