రెండో పెళ్ళికి సిద్దం...సౌందర్య రజినీకాంత్ ట్వీట్

SMTV Desk 2019-02-05 13:00:08  Soundarya rajinikanth, Rajinikanth, Second marriage, Ashwin, Vishagan

చెన్నై, ఫిబ్రవరి 5: తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ రెండో కుమార్తె సౌందర్య రజినీకాంత్ రెండో పెళ్ళికి సిద్దమైంది. తన భర్త అశ్విన్ తో అభిప్రాయబేధాల వల్ల వారి ఏడేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్తూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ వ్యాపారవేత్త విషాగన్ ని పెళ్లి చేసుకోబోతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై సౌందర్య అధికార ప్రకటన చేసింది. మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. పెళ్లి గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ తన కుమారుడు కాబోయే భర్త పేరుని జతచేసి క్యాప్షన్ గా పెట్టింది.

రజినీకాంత్ ఇంట్లోనే ఈ వేడుకను నిర్వహించాలని భావిస్తున్నారు. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కాబోతుంది. ఈ పెళ్లి వేడుకను వీలైనంత సింపుల్ గా చేయాలనేది రజినీకాంత్ ఆలోచన. అందుకే కనీసం పెళ్లి శుభలేఖలను కూడా అచ్చు వేయించలేదు. పెళ్లికి ఒకరోజు ముందు గెట్ టు గథెర్ ఏర్పాటు చేస్తున్నారు.