పెదవి విప్పని మూడు పార్టీలు

SMTV Desk 2019-02-05 12:27:35  TRS, BJD, AIDMK,TMC, Mamatha Banerjee, K.Chandrasekhar Rao, Naveen Patnayak, BJP

కొలకత్తా, ఫిబ్రవరి 5: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నియంగా మారాయి. దాదాపు అన్ని పార్టీలు ఈ ఘటన పై స్పందించాయి. అయితే తెలంగాణా అధికార పార్టీ టీఆర్ఎస్, ఒడిశాలోని బీజేడీ, తమిళనాడులోని అన్నాడీఎంకేలు మాత్రం పెదవి విప్పకపోవడం పట్ల జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నాయి.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నా సంగతి తెలిసిందే. ఈ ధర్నా గురించి ఈ మూడు పార్టీలు స్పందించకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని, ఎన్నికల అనంతరం రాజకీయానికి ఇది సంకేతమని అంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందులో భాగంగా మొదటగా కలిసింది మమతనే అని, కానీ ఇప్పుడు ఆమె బీజేపీపై పోరాడుతుంటే కేసీఆర్ మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా స్పందించలేరు. బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే ఆయన ఈ వివాదంపై స్పందించలేదని పేర్కొన్నాయి. తమిళనాడులోని ప్రతిపక్ష డీఎంకే మమతకు సంఘీభావం ప్రకటించడం వల్లే అన్నాడీఎంకే ఈ వివాదానికి దూరంగా ఉన్నట్టు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.