విదేశాల నుండి రాగానే సోదరుడిని భేటి అయిన ప్రియాంక

SMTV Desk 2019-02-05 11:01:41  Rahul Gandhi, Priyanka Gandhi, Congress

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: గత నెలలో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ప్రియాంక గాంధీ, విదేశీ పర్యటనను ముగించుకొని రాగానే తన సోదరుడు రాహుల్ గాంధీని కలిశారు. సోమవారం రోజు న్యూఢిల్లీలో ల్యాండ్ అయిన ఆమె, వెంటనే తుగ్లక్ రోడ్డులో ఉన్న రాహుల్ నివాసానికి వెళ్లారు. ఆ తరువాత వీరిద్దరి మధ్యా ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతంలో ఎన్నికల వ్యూహంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇదే సమావేశంలో పశ్చిమ యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జ్యోతిరాదిత్య సింథియా కూడా పాల్గొన్నారు.

గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కూడా ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో, ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ఎన్నికలకు సిద్ధమయ్యే విషయమై, విపక్ష పార్టీలతో తరచూ చర్చిస్తున్న రాహుల్, గత నెలలో స్వయంగా ప్రియాంక రాజకీయ అరంగేట్రంపై ప్రకటన వెలువరించిన సంగతి విదితమే.