'సినిమాకి ఎవరైనా అడ్డొస్తే ఖబడ్దార్'....వర్మ ట్వీట్ వైరల్

SMTV Desk 2019-02-05 10:57:56  Ram gopal varma, RGV, Lakshmis NTR, Twitter

హైదరాబాద్, ఫిబ్రవరి 5: వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా వుండే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ . ఈయన సోషల్ మీడియాలో చారా చురుగ్గా పాల్గొంటూ వివాదాస్పదమైన పోస్టులు పెడుతూ ఉంటాడు. అయితే తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు వర్మ. తన సినిమాకు ఎవరైనా అడ్డొస్తే ఖబడ్దార్ అంటూ తన పిక్ ని ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. అయితే ఆ ఫోటో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు, పాటలను విడుదల చేశాడు వర్మ. ట్విట్టర్ లో సినిమాకు సంబంధించి రోజుకో ఫోటో రిలీజ్ చేస్తూ హడావిడి చేస్తున్నాడు. ఈ సినిమాలో చంద్రబాబునాయుడిని తప్పుగా చూపించారంటూ కొందరు టీడీపీ నాయకులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసులు పెట్టారు. ఈ సినిమా విడుదల అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు వారందరికీ వర్మ తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చాడు.ట్విట్టర్ వేదికగా వర్మ ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఏయ్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ కి ఎవరైనా అడ్డొస్తే ఖబడ్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చేతిలో కత్తిపట్టుకొని ఉన్నట్లున్న ఓ మార్ఫింగ్ ఫోటోని పోస్ట్ చేశాడు. మరికోద్దిసేపటికి మరో ట్వీట్ చేశాడు. అందులో.. రేయ్ ఎన్టీఆర్ కథానాయకుడూ కాదూ, మహానాయకుడు కాదూ రా.. ఆయన అసలు నాయకుడు.. ఆ నిజం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని అసలు కథలో తెలుస్తుందిరా.. డబుల్ ఖబడ్దార్ అంటూ మరోసారి రాసుకొచ్చాడు.