టీడీపీలో చేరనున్న కృష్ణ సోదరుడు...!

SMTV Desk 2019-02-04 18:19:43  Aadisheshagiri Rao, YCP, TDP, Chandrababu, Krishna, Maheshbabu

అమరావతి, ఫిబ్రవరి 4: సినీనటుడు కృష్ణ సోదరుడు, సినీ నిర్మాత అయిన ఆదిశేషగిరిరావు త్వరలో టిడిపి లో చేరనున్నారు. ఆదిశేషగిరిరావు తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. వైసీపీకి ఇటీవలనే ఆదిశేషగిరిరావు రాజీనామా చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు నచ్చి ఆయనకీ మద్దతివ్వాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని రాజధానిని సక్రమంగా తీర్చి దిద్దగల సామర్ధ్యం ఒక్క చంద్రబాబుకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఆ విశ్వాసంతోనే తాను వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు స్పష్టం చేసారు.

తాను టీడీపీలోకి వెళ్లబోతున్న విషయాన్ని హీరో కృష్ణ, మహేష్‌బాబు అభిమానులతో చర్చించానని, వారు సానుకూలంగా స్పందించారని వివరించారు. నందమూరి, కృష్ణ, మహేశ్ బాబు అభిమాన సంఘాలు చంద్రబాబు గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన ఫిబ్రవరి 7న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. రాజధాని అమరావతి, పోలవరం పూర్తి కావాలంటే చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని ఆదిశేషగిరి రావు స్పష్టంచేశారు.