'హౌ టూ ట్రెయిన్ యువర్ డ్రాగన్3' తెలుగులో....

SMTV Desk 2019-02-04 18:16:17  How to train your dragon The hidden world, Dean DeBlois, Bonnie Arnold, Brad Lewis, Jay Baruchel, America Ferrera, F. Murray Abraham, Cate Blanchett, Gerard Butler

ఫిబ్రవరి 4: హాలీవుడ్ లో సంచలన విజయాన్ని అందుకున్న యానిమేషన్ సినిమా హౌ టూ ట్రెయిన్ యువర్ డ్రాగన్ . ఈ సినిమాకు అక్కడ ఊహించని విధంగా వసూళ్లు వచ్చాయి. దీనికి సీక్వెల్ గా వచ్చిన హౌ టూ ట్రెయిన్ యువర్ డ్రాగన్ 2 కూడా మంచి వసూల్లనే రాబట్టింది. అయితే ఇప్పుడు దీనికి మరో సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. హౌ టూ ట్రెయిన్ యువర్ డ్రాగన్(3): ద హిడెన్ వరల్డ్ ఈ సినిమాకు డీన్ డిబ్లాయిస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను మొదటి సారి తెలుగులో భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

జనవరిలోనే ఈ సినిమా ఆస్ట్రేలియాలో రిలీజయ్యింది. పాజిటివ్ రికార్డ్ అందుకున్న ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు హిందీ తమిళ్ తెలుగు భాషల్లో 3D లో రానుంది. మార్చ్ 22న 1000కి పైగా థియేటర్స్ లో ఈ మూడవ సీరీస్ ను రిలీజ్ చేయనున్నారు. దాదాపు 125 మిలియన్ డాలర్స్ కు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 900 కోట్లతో సమానం. తెలుగు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.