పశ్చిమబెంగాల్ లో ఉహించని పరిణామలు

SMTV Desk 2019-02-04 18:08:43  Raj Nath Singh, Kesari Nath Tripati, Rajiv Kumar, CBI, West Bengal Report

కొలకత్తా, ఫిబ్రవరి 4: పశ్చిమబెంగాల్ లో ఉహించని పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న అనివార్య కార్యాల గురించి నివేదిక పంపినట్టు కోల్ కతాలోని రాజ్ భవన్ వర్గాలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠితో రాజ్ నాథ్ ఫోన్ లో చర్చించారు. అనంతరం నివేదిక పంపించాలని కోరారు.

శారదా కుంభకోణం కేసులో కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారించేందుకు సీబీఐ అధికారులు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ముఖ్యమంత్రి మమత బెనర్జీ ధర్నాకు దిగారు. దీంతో, ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.