మళ్ళీ కెమార ముందుకొచ్చిన సోనాలి

SMTV Desk 2019-02-03 19:22:24  Sonali Bendre Behl, Cancer, Actor, Movie shooting

ముంభై, ఫిబ్రవరి 3: ప్రముఖ నటి సోనాలి బింద్రే గత కొంత కాలంగా కాన్సర్ వ్యాధితో భాదపడుతున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో చికిత్స కోసం వెళ్లిన ఈ నటి ఈ మధ్యే ఇండియాకు తిరిగొచ్చింది. ఇప్పుడామె మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆనందంగా అభిమానులతో పంచుకొన్నారు సోనాలీ. చాలా గ్యాప్ తర్వాత తిరిగి సెట్స్ పైకి వచ్చాను. ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది. మళ్లీ కెమెరా ముందుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. తిరిగి కెమెరా ముందు నిలబట్టపుడు కలిగిన ఆ ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేను అంటూ ట్విట్ చేసింది సోనాలి.

ఐతే, అది ఏ సినిమా సెట్స్ అనే విషయం మాత్రం చెప్పలేదు. బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న సోనాలీ.. తెలుగులో ఆమె నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేమికుల రోజు, ఖడ్గం, ఇంద్ర, మురారి శంకర్ దాదా ఎంబీబీస్.. సినిమాలో సోనాలీ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక్కడ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.