ఈ-ప్రగతి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం

SMTV Desk 2017-08-01 17:54:13  AP CM, chandrababu naidu, Chief minister, TDP, E-pragati, Employee training program by Govt of AP

అమరావతి, ఆగష్టు 1: సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ముందడుగు వేసే ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు ఈ-ప్రగతి శిక్షణను ప్రారంభించారు. ఈ శిక్షణ ఉద్యోగుల్లో కొత్త టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ పట్ల అవగాహన పెంచడానికి ఏర్పాటు చేసారు. తద్వారా వారిలో పనితీరు అభివృద్ధి చెంది, ఫలితాలు వేగంగా రావడానికి దోహదం చేస్తుంది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017-18ని ఈ-ప్రగతి సంవత్సరంగా పరిగణించామని చెప్పారు. మెరుగైన పనితీరును చూపించడానికి సాంకేతికత ఉపయోగపడుతుందని అన్నారు. టెక్నాలజీ వినియోగం ఖర్చుతో కూడుకున్నదనే వాదన సరైనది కాదని... టెక్నాలజీతో డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేశ్, కామినేని శ్రీనివాస్ లు హాజరయ్యారు.