అమెరికా గడ్డపై ఉరట

SMTV Desk 2017-05-27 18:05:23  h1bvisa,america,visa,tramp,critical,phds

అమెరికా, మే 26 : అమెరికా హెచ్ 1 బి విసా నిబంధనలు కఠినతరం చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే. అందులో ఆమెరికాపై అత్యధికంగా ఆధారపడిన భారత్ కు సంక్షోభ పరిస్థితులు దాపురించాయి. ఐటి ఉద్యోగాలకు కోత విధించడంతో పెద్దఎత్తున నిరుద్యోగులుగా మిగిలారు. ఇటువంటి కీలక సమయంలో వివిధ అంశాలలో పిహెచ్ డీలు చేసిన వారికి మినహాయింపు ఇవ్వడంతో సంక్షోభం ముప్పు తప్పినట్లయింది. ఇందుకు సంబంధించి స్టాపింగ్ ట్రైయిన్డ్ ఇన్ అమెరికా పిహెచ్ డిస్ ప్రమ్ లీవింగ్ ది ఎకనామి (స్టాపిల్ ) చట్టం కు సంబంధించిన బిల్లును అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు. దాని ప్రకారం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ లేదా గణిత శాస్త్రాల్లో అమెరికన్ పిహెచ్ డి పూర్తి చేసిన వారికి మినహాయింపు ఇవ్వాలనేది బిల్లు సారాంశం. బిల్లు చట్టంగా అమల్లోకి వస్తే పీహెచ్ డీలు చేస్తున్న భారతీయ విద్యార్థినీ విద్యార్థులకు లాభం చేకూరుతుందని స్పష్టం అవుతున్నది. తమ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించిన వారిని వదులుకోవడం వల్ల ప్రగతిని, సాంకేతికతను దూరం చేసుకోవడమే అవుతుందని భావించి బిల్లును కాంగ్రెస్ ప్రతినిధులు ఎరిక్ పాల్సన్, మైక్ గ్వేగ్ లు ప్రవేశ పెట్టారు.