ఘోర రైలు ప్రమాదం, ఆరుగురి మృతి

SMTV Desk 2019-02-03 13:18:31  Train Accident, Bihar

పాట్నా, ఫిబ్రవరి 3: రైలు పట్టాలు తప్పడం తో బీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఈరోజు తెల్లవారు జామున 3.52 గంటల సమయంలో జరిగింది. జోగ్బాణి-ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో 14 మందికి గాయాలయ్యాయి. సోన్పూర్ డివిజన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ సంఘటన బీహార్ రాష్ర్టంలోని షహదాయి బుజుర్గ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. మూడు స్లీపర్ కోచ్‌లు (ఎస్8, ఎస్9, ఎస్10)లు, ఒక జనరల్ కోచ్, వొక ఏసీ (బీ3) కోచ్ సహా మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పాయి.

సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు, వైద్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సోన్పూర్, బారౌనీ ప్రాంతాల నుంచి వైద్యులు ప్రమాదస్థలికి వచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల సహాయార్థం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. సోన్పూర్‌ - 06158221645, హజీపూర్‌ - 06224272230, బరౌనీ - 06279232222.