నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా...

SMTV Desk 2017-08-01 17:36:43  Neethi Ayog Vice Chairman Arvind Panagariya,Resign from office, National Institution of Transforming India

ఢిల్లీ, ఆగస్టు 1 : నేడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెలాఖరు వరకు నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా (ఎన్ఐటీఐ)కు ఆయన తన సేవలను అందించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అరవింద్ పనగారియా మాట్లాడుతూ... అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా తిరిగి తన జీవితాన్ని ప్రారంభిస్తానని, ఇన్నాళ్లు తను సెలవులో వున్నానని, సెప్టెంబర్ 5తో తన సెలవు గడువు పూర్తవ్వడంతో, అదే రోజు నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతానని అన్నారు. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీకి చెప్పానని ఆయన వెల్లడించారు. కాగా, ఆయన 2015 జనవరి 5న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.