టీడీపీని వీడే సమస్యే లేదు: గంటా శ్రీనివాసరావు

SMTV Desk 2019-02-03 10:04:06  Ganta Srinivas Rao, Pawan Kalyan, Narendra Modi, TDP, Janasena

అమరావతి, ఫిబ్రవరి 3: అసెంబ్లీ ఎన్నికలు సమిపిస్తున్నవేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రస్తుతం ఉన్న పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులూ పార్టీ లు మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేనలోకి చేరబోతున్నరంటు వార్తలు వచ్చాయి. కానీ గంటా శ్రీనివాసరావు ఈ పుకార్లను తిప్పికొట్టారు. తాను టీడీపీని వదిలే సమస్యే లేదని ఆయన స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో తన గెలుపులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాత్ర ఉందన్నారు, కానీ ఆయన వల్లే తాను గెలిచాననడం సరికాదని చెప్పారు. రాజకీయాలపై మరింత అవగాహనను పవన్ పెంచుకోవాలని తెలిపారు. ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేసిన ప్రధాని మోదీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారని ప్రశ్నించారు.