క్రిష్ పై కంగనా సెటైర్స్

SMTV Desk 2019-02-02 19:24:49  Manikarnika, Kangana ranaut, Krish jagarlamudi

హైదరాబాద్, ఫిబ్రవరి 2: మణికర్ణిక వివాదం రోజురోజుకి తీవ్ర స్థాయిలో వేడెక్కుతోంది. క్రిష్, కంగనా వొకరిపై మరొకరు మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కంగనా క్రిష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మణికర్ణిక సినిమాకి నేనే దర్శకత్వం వహించాను ఇందులో మరో మాటే లేదు , వొకవేళ క్రిష్ ఈ విషయం కాదని అంటే అతడు ఎక్కడైనా నిరూపించుకోవచ్చు లేదంటే అన్యాయం జరిగింది అని భావిస్తున్న వాళ్లతో కలిసి మళ్ళీ మణికర్ణిక తీసుకోవచ్చు అంటూ చులకనగా మాట్లాడింది వివాదాస్పద భామ కంగనా రనౌత్. మణికర్ణిక చిత్రానికి దర్శకత్వం క్రిష్ వహించలేదని సవాల్ చేస్తోంది కంగనా.

అంతేకాదు క్రిష్ వొక్కడి పైనే కాకుండా మా పాత్రలకు అన్యాయం జరిగింది అని మరికొంతమంది ఫీల్ అవుతున్నారు అలాంటి వాళ్లంతా కలిసి క్రిష్ తో కలవండి అంటూ పూచిక పుల్లలా తీసి పడేసింది కంగనా రనౌత్. మొత్తానికి ఈ వ్యవహారంలో క్రిష్ క్రెడిట్ సంగతి పక్కన పెడితే మరింతగా నాశనం అయ్యింది అతడి ఇమేజ్. వొకవైపు ఎన్టీఆర్ కథానాయకుడు అట్టర్ ప్లాప్ కావడం, మరోవైపు మణికర్ణిక విషయంలో ఉన్న క్రెడిట్ పోవడమే కాకుండా అవమానాలకు గురి చేయడంతో క్రిష్ పరువు గంగలో కలిసింది.