వరుణ్ కోసం స్టొరీ రెడీ చేసిన బన్నీ

SMTV Desk 2019-02-02 18:30:32  Allu arjun, Varun tej, Sonu ke titu sweety, Remake

హైదరాబాద్, ఫిబ్రవరి 2: "సోను కే టీటూ కీ స్వీటీ" హిందీ సినిమాపై టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మనసు పడింది. దీన్ని ఎలాగైనా తెలుగులో రిమేక్ చెయ్యాలనే ఆలోచనలో పడ్డాడు స్టైలిష్ స్టార్. అయితే తన కెరీర్ లోనే ఇదివరకు ఎప్పుడూ రీమేక్ సినిమాలు చేయని అల్లు అర్జున్ ఫస్ట్ టైం ఈ సినిమాపై మనసు పారేసుకున్నాడు. అయితే అల్లు అర్జున్ స్టార్ డం కి ఈ కథ సెట్ కాదని బాలీవుడ్ లో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన టీ సిరీస్ వాళ్ళు చెప్పారట. ఇక అల్లు అర్జున్ చేసేది లేక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వొక సినిమా స్టార్ట్ చేసాడు.

ఇక ఇప్పుడు ఇదే సినిమాని వరుణ్ తేజ్ ని హీరోగా పెట్టి గీత ఆర్ట్స్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. ఇటీవలే "ఎఫ్ 2" సినిమాలో తన కామెడీ టైమింగ్ ని వర్క్ అవుట్ చేసిన వరుణ్ తేజ్ కి ఈ కథ అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని అల్లు అర్జున్ భావిస్తున్నాడట. గీత ఆర్ట్స్ తో పాటు టీ సిరీస్ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణం లో భాగం కానున్నారు.